జమ్మలమడుగు: యామవరం : గ్రామంలో రైతులకు యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం యామవరం మరియు చింతకుంట గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఖరీఫ్ లో సాగు చేసిన ప్రతి పంటను రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలన్నారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని కోరారు. అనవసరంగా యూరియా వాడితే పంట ఏపుగా పెరిగి దోమ పోటుకు గురి అవుతుందన్నారు. తదుపరి పంట దెబ్బతిని దిగుబడులపైన ప్రభావం చూపుతోందన్నారు. ప్రతి పంటకు యూరియా ను శాస్త్రవేత్తలు సూచించిన పరిమాణం మేరకే వాడుకోవాలన్నారు.