గజపతినగరం: ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత: గజపతినగరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు
గజపతినగరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం మధ్యాహ్నం ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శాఖల వారిగా ప్రగతి పై సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు వారి వారి ప్రగతి వివరాలను చదివి వినిపించారు పలువురు సభ్యులు వారి వారి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలియజేశారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పెనిమర్చి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందన్నారు సమావేశంలో జెడ్పిటిసి గార తవుడు, గజపతినగరం ఏఎంసీ చైర్మన్ పివివి గోపాలరాజు, ఇన్చార్జ్ ఎంపీడీవో పుష్పలత,సర్పంచులు ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.