గిద్దలూరు: పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో విస్తారంగా వర్షాలు, ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు పరిసర ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలుల వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కంభంలోని కొన్ని ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.