మహదేవ్పూర్: ఈనెల 22 నుంచి కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ఈనెల 22 నుంచి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీ శుభానంద, సరస్వతీ దేవి అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించనున్నారు. పదకొండు రోజులు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న ప్రారంభమై అక్టోబర్ 2న నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. శ్రీ శుభానందదేవి (పార్వతీ), శ్రీ మహా సరస్వతీ అమ్మవార్ల ఆలయాలను ప్రత్యేకంగా అలయ అర్చకులు, అధికారులు ముస్తాబు చేస్తున్నారు. 11 రోజుల పాటు అమ్మవార్లు