మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకున్న ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు
Machilipatnam South, Krishna | Sep 17, 2025
మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనను ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్న ద్వారకా తిరుమలరావు, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.