తాడేపల్లిగూడెం: లేఖర్ల పెన్‌డౌన్ ఉద్యమంలో పాల్గొని మాట్లాడిన ఆ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు సుబ్బారావు
ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానాల్లో తీసుకు వస్తున్న చట్టాలలో లోపాల సర్దుబాటు కోసం పెన్ డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు సుబ్బారావు పేర్కొన్నారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయ వద్ద లేఖర్ల పెన్ డౌన్ ఉద్యమంలో ఆయన శుక్రవారం సాయంకాలం ఐదు గంటలకు పాల్గొని మాట్లాడారు కక్ష దారులు చాలా వరకు నిరక్షరాక్షలు కావడం వల్ల 2.0 లోని ఓటిపి విధానాన్ని రద్దు చేయాలని ప్రజా అనుకూలంగా చట్టాలను చేయాలని సుబ్బారావు కోరారు.