సమాజ్ వాదీ పార్టీ అధినేత,మాజీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు అఖిలేష్ యాదవ్ శుక్రవారం హైదరాబాద్‌కు వ్యక్తిగత కార్యక్రమ నిమిత్తం విచ్చేశారు. ఈ సందర్బంగా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ సదర్ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఇది రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే మంచి నిర్ణయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ ఇన్చార్జి తోటకూర వజ్రష్ యాదవ్ పాల్గొన్నారు