టీ న్యూస్, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆధారాలు లేకుండా తనపైన, తన భర్త పైన భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారని ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.