పూతలపట్టు: బంగారుపాళ్యం హైవేలో పార్సల్ తరలిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా
అదుపుతప్పి పార్సల్ తరలిస్తున్న వాహనం బోల్తా పడి డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాళ్యం మండలంలోని చరణ్ డాబా సమీపంలో బెంగుళూరు వైపు నుండి చిత్తూరు వైపు వస్తున్న వి ఆర్ ఎల్ పార్సెల్ సర్వీస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.