కోడూరు: టైక్వాండ్ అండర్- 19 కి ఎంపికైన కోడూరు విద్యార్థి హారిక
రైల్వే కోడూరు కు చెందిన విద్యార్థిని బి.హారిక నవంబర్ లో జమ్మూ కాశ్మీర్లో జరుగునున్న జాతీయ స్థాయి టైక్వాండ్ పోటీలకు ఎంపిక అయినట్లు SGF ఆర్గనైజింగ్ కార్యదర్శి శారద వెల్లడించారు. కోడూరు పట్టణంలో సిఎస్ఆర్ కళ్యాణమండపం లో నిర్వహించిన 69వ SGF అండర్-19 రాష్ట్రస్థాయి పోటీలలో హారిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిందని కోచ్ శివాజీ తెలిపారు.