అనంతపురం జిల్లా నార్పల లో దంపతులపై హత్యాయత్నం, విచక్షణారహితంగా కట్టెలు రాడ్డులతో దాడి
Anantapur Urban, Anantapur | Nov 10, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో సూర్యనారాయణ శాంతి అనే దంపతులపై పలువురు హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సోమవారం సాయంత్రం మీడియాకు వివరాలను వెల్లడించారు. స్థలానికి తాము అడ్డుపడుతున్నామని ఒక్కసారిగా కట్టెలు రాడ్లతో దాడి చేసి గాయపరిచినట్లుగా వారు తెలియజేశారు. తమకు ప్రాణహాని ఉందని రక్షించాలని వేడుకుంటున్నారు.