హత్నూర: చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఇంటింటి చెత్త సేకరణ కార్మికులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని సూచించారు. చెత్తను రోడ్లపై కాకుండా డంపింగ్ యార్డ్ కు తరలించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.