కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో గాలి మరల ప్రాజెక్టు ఏర్పాటుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు శంకుస్థాపన
కళ్యాణదుర్గంలో గాలి మరల ప్రాజెక్టు ఏర్పాటు కు మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రాజెక్ట్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కళ్యాణదుర్గంతో పాటు కంబదూరు, సెట్టూరు మండలాల పరిధిలో మూడు గాలి మరల కంపెనీలు ఏర్పాటు చేయిస్తామన్నారు. గాలిమరల కంపెనీలు ఏర్పాటు అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమ న్నారు.