రాయదుర్గం: పట్టణంలో బాణాసంచా విక్రయదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : సిఐ జయనాయక్
బాణాసంచా విక్రయదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రాయదుర్గం సిఐ జయనాయక్ సూచించారు. శనివారం ఉదయం ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంంలో బాణాసంచా లైసన్సు విక్రయదారులు అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా టపాసుల నిల్వ చేయరాదన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. చిన్న పిల్లలు, మహిళలు టపాకాయలు కల్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రశాంతంగా పండుగ చేసుకోవాలన్నారు.