గుడ్లవల్లేరులో ఎరువుల దుకాణాన్ని అకస్మికంగా తనిఖీ చేసి యూరియా నిల్వ వివరాలను తెలుసుకున్నా జిల్లా కలెక్టర్
Machilipatnam South, Krishna | Sep 14, 2025
జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని రైతుల అవసరాన్ని బట్టి యూరియా పంపిణీ చేస్తామని ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ స్తానిక గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో పర్యటించి యూరియా స్థితిగతులపై ఆరా తీశారు. తొలుత గుడ్లవల్లేరు మండల కేంద్రమైన గుడ్లవల్లేరు లో మన గ్రోమోర్ కేంద్రం కోరమాండల్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు.