నాయుడుపేట పోలీస్ స్టేషన్ ను అకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
తిరుపతి జిల్లా నాయుడుపేటలో బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అర్బన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డుల పరిశీలనతో పాటు కేసుల పురోగతిని సమీక్షించారు. అలాగే సిబ్బంది హాజరు, శుభ్రత, ఆయుధాల భద్రత వంటి అంశాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. క్రమశిక్షణ, పారదర్శకతతో పని చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.