గుంతకల్లు: గుత్తి అర్ఎస్ హోరేబ్ కాలనీ సమీపంలో విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ, తొమ్మిది తులాలు బంగారు, రూ.15వేలు అపహరణ
అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని హోరబ్ చర్చి సమీపంలో విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి అర్ఎస్ కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి సుధాకర్ ఈ నెల 19న పని నిమిత్తం హైదరాబాద్ కు వెళ్ళాడు. పని ముగించుకొని ఆదివారం వేకువజామున తిరిగి స్వగ్రామం గుత్తి అర్ఎస్ కు వచ్చాడు. ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా చోరీ జరిగినట్టు గుర్తించాడు. ఇంట్లోని బీరువాను పరిశీలించగా సుమారు తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు.