సంగారెడ్డి: ఈ నెల 30వ తేదీలోపు మంచినీటి నివేదికలు అందించాలి: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి మరియు సదాశివపేట పట్టణంలో మంచినీటి పథకాల నివేదికలను ఈ నెల 30వ తేదీలోపు సమర్పించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డితో కలిసి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తారని, మంచి నీటి అవసరాల కోసం ఆయనతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.