కుప్పం: జీఎస్టీ తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయం: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
భారత ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై గురువారం కుప్పంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఎమ్మెల్సీ సూచించారు. బుల్లెట్ బైక్ పై తిరుగుతూ కుప్పంలో జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించారు.