మంత్రాలయం: మాధవరం తండాలో తాండ ఎంప్లాయిస్ గ్రూప్ ఆధ్వర్యంలో 5K వాక్
మంత్రాలయం: మండలంలోని మాధవరం తండాలో తాండ ఎంప్లాయిస్ గ్రూప్ ఆధ్వర్యంలో 5K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, సీఐ రామాంజులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ యువత దేశభక్తి, ఆరోగ్య పరమైన అలవాట్లు పెంచుకోవాలన్నారు. నడక శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు.