నల్గొండ: డ్రా సిస్టంలో ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ప్రెసిడెంట్ ఆర్డర్లు ఇవ్వాలని వంటావార్పు కార్యక్రమం
నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వెనకాల ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రా సిస్టంలో ఎంపికైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం వంటావార్పు కార్యక్రమం నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రా సిస్టంలో ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక పోరాటాల ఫలితంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలన్నారు.