కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని హిందూ స్మశాన వాటిక స్థలం కబ్జా చేసినట్లు ధ్రువీకరించిన తహశీల్దార్ భాస్కర్
కళ్యాణదుర్గంలోని హిందూ స్మశాన వాటిక స్థలం కబ్జాపై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం తహశీల్దార్ భాస్కర్ హిందూ స్మశాన వాటిక స్థలం కబ్జాపై విచారణ చేపట్టారు. స్మశాన వాటికలోని సుమారు ఎకరా స్థలం కబ్జాకు గురైనట్లు ధ్రువీకరించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు తహశీల్దార్ లేఖ రాశారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు.