మంత్రాలయం: దేవీ నవరాత్రుల సందర్భంగా మంత్రాలయం గ్రామదేవత మాంచాలమ్మ దేవికి ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం లో సోమవారం గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవికి శరవన్న నవరాత్రుల మొదటిరోజు విశేష పూజలను చేశారు. అమ్మవారికి వేకువజామునే జలాభిషేకాలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సుగంధ ద్రవ్యాల నీటితో అభిషేకించారు. వెండి కవచాలు పట్టు చీరలతో అలంకరించారు. నైవేద్యాలు సమర్పించే మంగళహారతులు ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.