కొత్తవలసలో పిడబ్ల్యూ 1 ఆఫీస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం: కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు
Vizianagaram Urban, Vizianagaram | Sep 16, 2025
కొత్తవలస రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం నెంబర్ వన్ సమీపంలో పిడబ్ల్యూ1 ఆఫీస్ షెడ్డు కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బి ఎన్ ఎస్ ఎస్ కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి వివరాలు తెలిసినవారు కొత్తవలస పోలీసులను సంప్రదించాలన్నారు.