గంగాధర నెల్లూరు: SRపురం మండలంలోని చిత్తూరు-పుత్తూరు హైవేపై సంగం డైరీ వద్ద ప్రమాదం
SRపురం మండలంలోని చిత్తూరు-పుత్తూరు హైవేపై సంగం డైరీ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో-బైకు ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు 108 వాహనంలో దగ్గరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.