నగరి: వడమాల పేటలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాను ప్రకాష్
వడమాలపేటలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు. అప్పలాయ గుంటకు చెందిన టి. చెంగమ్మకు 20,000, టి.సి. అగ్రహారంకు చెందిన బి. ముని కుమార్ కు 1,25,960, బట్టికండ్రిగకు చెందిన పి. మణికి 35,900, ఎనమలపాలెంకు చెందిన మునస్వామికి 25,000 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.