ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు మంగళవారం పర్యటిస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Nov 10, 2025
ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలంలో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసు సిబ్బందికి ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించి సూచనలు ఇచ్చారు. హెలిపాడ్ వద్ద నుంచి సభ ప్రాంగణం వరకు దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.