జమ్మలమడుగు: కడప : విజృంభిస్తున్న విష జ్వరాలు... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన సిపిఎం నాయకులు
కడప జిల్లా కడప నగరంలో వర్షాలు పడడంతో సీజనల్ వ్యాధులు మలేరియా, టైఫాయిడ్ డెంగ్యూ వంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయని నగరంలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలకు రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని డాక్టర్లు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. సోమవారం కడప అక్కాయపల్లిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ను సిపిఎం నగర కమిటీ ప్రతినిధి బృందం పరిశీలించి అక్కడ ఉన్న రోగులతో మాట్లాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలో వర్షాలు పడుతుండడంతో డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉందన్నారు.