కదిరిలో శ్రీ సత్యసాయి జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సమావేశం
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి అందరం కలిసి కట్టుగా కృషిచేస్తామని అసోసియేషన్ నాయకులు తెలిపారు.