జమ్మలమడుగు: చింతకొమ్మదిన్నె : మధ్యాహ్న భోజన కార్మికులను అర్ధాంతరంగా మానుకోవాలనడం తగదు - ఏఐటీయూసీ
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటులో కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగదని కూటమి ప్రభుత్వం ఓ పక్క చెబుతున్నా అందుకు విరుద్ధంగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చింతకొమ్మదీన్నే మండల విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తున్నారని సోమవారం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి డిఇఓ శంషుద్దీన్ కు ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసి బాదుల్లా, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కామాక్షి, వర్కింగ్ ప్రెసిడెంట్ మేరీ కోశాధికారి పార్వతి లక్ష్మీదేవి జయమ్మలు లు వినతి పత్రం సమర్పించారు.