కక్షసాధింపులకు దూరంగా కూటమి ప్రభుత్వం : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
మనుబోలు మండలం అక్కంపేట పంచాయతీ నుంచి షేక్ అమీర్ బాషా ఆద్వర్యంలో 36 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. పాత, కొత్త నాయకులందరూ సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, నాయకులపై కక్షసాధింపులకు పాల్పడటం, రాజకీయ వేధింపులకు గురిచేయడం మాకు అలవాటు లేదన్నారు.