కొండపి: కొండపి మండలంలోని పొగాకు నారులను పరిశీలించి రైతుల రసీదులు ఇవ్వాలని ఆదేశించిన కమిటీ సభ్యులు
పొగాకు నారు కొనుగోలు చేసిన రైతులకు రసీదులివ్వాలి' పొగాకు నారు పెంచే రైతులు తప్పనిసరిగా నారు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు ఇవ్వాలని నర్సరీ మానిటరింగ్ కమిటీ సభ్యులు సత్య శ్రీనివాస్, మోతిలాల్ సూచించారు. తప్పనిసరిగా పొగాకు నారు కొనుగోలు చేసిన యజమానిదగ్గర రసీదులు తీసుకోవాలని చెప్పారు. కొండపి మండలంలోని గ్రామాల్లో నారు నర్సరీలను పరిశీలించారు. నర్సరీలు రిజిస్టర్ చేయించుకోని రైతులు తప్పనిసరిగా చేయించుకుని రసీదు పుస్తకాలు తీసుకోవాలన్నారు.