నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్న JB ఎలక్ట్రానిక్స్ షాప్లో శనివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో షాప్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.