మంత్రాలయం: సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి నౌలేకల్ ప్రజలు సహకరించాలి: డీడీవో బాలకృష్ణ రెడ్డి
పెద్ద కడబూరు:సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ప్రజలను ఆదోని డీడీవో బాలకృష్ణ రెడ్డి కోరారు. సోమవారం పెద్ద కడబూరు మండలం నౌలేకల్ లో స్వామిత్వ గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లు, ఖాళీ స్థలాలకు సంబంధిత సర్వే పూర్తయి, నోటీసుల ప్రకారం అంగీకార పత్రాలను స్వీకరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. ఇందులో ఎంపీడీవో ప్రభావతి దేవి, ఈవోఆర్డీ జయరాముడు ఉన్నారు.