ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలం క్షేత్రంలో, మన ఊరు, మన గుడి, మన బాధ్యత కార్యక్రమంలో
ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలం క్షేత్రంలో ఆదివారం మన ఊరు, మన గుడి, మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా స్థానిక బీగాల ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పురాతన పుష్కరిణిని పలువురు శుభ్రం చేశారు. ఇందులో 120 మంది భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు కోనేరులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు.