జమ్మలమడుగు: జమ్మలమడుగు : గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి సీనియర్ సిటిజనులకు న్యాయం చేసిన ఆర్డీఓ సాయిశ్రీ
కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డిఓ సాయిశ్రీ గిఫ్ట్ డిడ్ ను రద్దుచేసి మంగళవారం సీనియర్ సిటిజనులకు న్యాయం చేసింది.తమ జీవితకాలంలో సాధించిన ఆస్తిని తమ పిల్లలకు బంధువులకు దానం చేసి చిత్రహింసకు గురవుతున్న కడప జిల్లా జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్ పరిధిలో నివసిస్తున్న ముగ్గురు వయోవృద్ధులు, తమ న్యాయపరమైన హక్కులను మైంటైన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ద్వారా సాధించుకున్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం తల్లిదండ్రులు, వృద్ధులు తమ మౌలిక అవసరాలకు బదులుగా పిల్లల పేర్లకు ఆస్తిని బదిలీ చేస్తే సకాలంలో ఆదరించకపోతే ఆ డీడును రద్దు చేయించుకునే అర్హత వారికుంటుంది.