అసిఫాబాద్: సాక్షి ఎడిటర్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఆసిఫాబాద్ జర్నలిస్ట్
నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి ఎడిటర్ , రిపోర్టర్ లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆసిఫాబాద్ జర్నలిస్ట్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ..సాక్షిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలంటూ డిమాండ్ చేశారు. భావప్రకటనా స్వేచ్ఛకు ఏపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందంటూ జర్నలిస్ట్ లు మండిపడ్డారు.