పిచ్చా టూర్ లోని అరణ్య ఆర్ ప్రాజెక్టుకు నీరు విడుదల చేసిన అధికారులు
అరనియార్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల పిచ్చాటూరులోని ఆరనియారు ప్రాజెక్టు నుంచి ఒక గేటు ద్వారా 400 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఉదయం 6:00 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 628 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వస్తున్నట్లు ఏఈ ధరణి కుమార్ తెలిపారు. నీటిమట్టం ప్రస్తుతం 31 అడుగులకు గాను 28.80 అడుగులు నీరు నిల్వ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అరుణానది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.