శ్రీకాకుళం: పలాస లో రణభేరి కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
విద్య, ఆర్థిక రంగాల సమస్యలపై యుటిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రణభేరి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలాసలో సోమవారం రణభేరి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రణభేరి కార్యక్రమాన్ని నిలిపివేయాలని DSP వెంకట అప్పారావు సూచించారు. తాము శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని అడ్డుకోవడం సరికాదు అంటూ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.