పులివెందుల: ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడమే తమ బాధ్యత, ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ విద్యార్థుల వెల్లడి
Pulivendla, YSR | Oct 26, 2025 సామాజిక సేవలతో తమ గుర్తింపు సాధ్యమని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ జె.దీప్తి అన్నారు. ఏడు రోజుల పాటు ఎన్ఎస్ఎస్ 11,13,14,15 విభాగాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు, విద్యార్థులకు సామాజిక ఆర్థిక సర్వే, సేంద్రీయ వ్యవసాయం, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాల పట్ల అవగాహన కల్పించారు. గ్రామాల్లోని ప్రజలు చైతన్యవంతం కావడం, వివిధ అంశాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని డా.జె.దీప్తి వెల్లడించారు.