ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఎంపీడీవో వీర్రాజు పిలుపునిచ్చారు. యాడికి లో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్తను పడి వేయకూడదన్నారు. అందరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ శశికళ తదితరులు పాల్గొన్నారు.