కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలో సచివాలయానికి వచ్చిన తమ కార్యకర్తలపై కూటమి నాయకుల వర్గీయులు దాడి చేయడం అమానుషమని సోమవారం జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుదీర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడి చేస్తూ ఉండటం పద్ధతి కాదన్నారు. కార్యకర్తలకు ఏమి జరిగినా వారికి అండగా ఉంటానన్నారు.పొద్దుటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఆయన పరామర్శించారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాలయ్య,ఇతరులు పాల్గొన్నారు.