మేడ్చల్: మియాపూర్ అల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ దాకా భారీ ట్రాఫిక్ జాం
మియాపూర్ ఆల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ దాకా భారీ ట్రాఫిక్ జాం నెలకొంది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ దాక వెళ్లడానికి గంటలు కొద్ది సమయం పడుతుంది అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసు సైతం రంగంలోకి దిగి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. వనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.