భీమడోలులో అంబేద్కర్ జీవితం పలు అంకాలను చూపుతూ సినీ తరహాలో నాటకం
Eluru Urban, Eluru | Sep 29, 2025
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని ఫూలే అంబేడ్కర్ మిషన్ రాష్ట్రనాయకులు సిర్రా భరత్ అన్నారు. భీమడోలులో అంబేడ్కర్ జీవిత విశేషాలను చూపుతూ బుద్దం శరణం గచ్చామి అనే పేరుతో హైదరాబాద్ కు చెందిన కళాకారులు సినీతరహాలో నాటక ప్రదర్శనను నిర్వహించారు. కార్యక్రమంలో తొలుత స్థానిక సర్పంచ్ పాము సునీతా మాన్ సింగ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లింగరాజు, ఎంపీటీసీ ముళ్లగిరి జాన్సన్, మాజీ జడ్పీటీసీ ఈదా వెంకటరత్నం, నాగేంద్రవరప్రసాద్, బీజేపీ నాయకులు ప్రవీణ్ పటేల్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.