పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది : కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి లో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో శనివారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు. బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపడానికి కదిరి నుంచి జగన్ గొడ్డలి కొని తీసుకెళ్తే, సీఎం చంద్రబాబు కదిరి నుంచి పులివెందులకు సాగునీటినీ, తాగునీటిని అందించారని అన్నారు. కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత చెరువులకు నీళ్ళు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు.