సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం ఎంతవరకు కరెక్టో మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. స్థాయి మరిచి కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. హిమాయత్‌నగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్య కర్తల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. ఉప ఎన్నిక వస్తే తనదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.