శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల సందర్బంగా భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.బస్టాండ్‌లో బస్సుల ఫ్రీక్వెన్సీ, రాకపోకల సమయాలు, వివిధ ప్రాంతాలకు బయలుదేరే బస్సుల షెడ్యూల్ వంటి అంశాలపై ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్సులు సమయపాలన పాటిస్తున్నాయా? భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అన్న విషయాలను ప్రయాణికులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. భక్తులకు స్పష్టమైన సమాచారం అందించేందుకు సమర్థవంతమైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేసి, బస్సు రాకపోకల వివరాలను తెలుసుకున్నారు.