కోడుమూరు: కోడుమూరు కేజీబీవీలో బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన
కోడుమూరు కేజీబీవీలో గురువారం బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి శ్రీమంత్ మాదన్న మాట్లాడుతూ బాల బాలికలకు నిర్ణీత వయసు వచ్చేవరకు వివాహం చేయకూడదన్నారు. బాల్యవివాహాల వలన అనారోగ్య సమస్యలు, రక్తహీనత, ప్రసూతి మరణాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఫిర్యాదులపై చైల్డ్ లైన్ 1098, పోలీసు 100, దిశ 181, 112 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు.