తాడికొండ: నామినేషన్ దాఖలు చేసిన తెనాలి శ్రావణ్ కుమార్.
నామినేషన్ దాఖలు చేసిన తెనాలి శ్రావణ్ కుమార్. తాడికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు కార్యకర్తలతో కలిసి భారీగా తరలివెళ్లారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ , గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుతో కలిసి తాడికొండ రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఊరేగింపుగా వెళ్లారు. తాడికొండ నియోజకవర్గ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, వారి ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుస్తానని శ్రావణ్ కుమార్ తెలిపారు. కత్తెర సురేష్ కుమార్, కత్తెర క్రిస్టినా పాల్గొన్నారు.