ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం చింతలపాలెం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. ముగ్గురు యువకులు టంగుటూరు నుంచి కామేపల్లికి బైకుపై బయల్దేరారు. చింతలపాలెం సమీపంలో టర్నింగ్ వద్ద అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లారు. యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. యువకులది బాపట్ల అని స్థానికుల సమాచారంతో పోలీసులు గుర్తించారు.